ఫ్రాన్స్ కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలై ను సందర్శించారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలోని ఓ మహిళను గైడ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అరుణాచలం అంత పుణ్యక్షేత్రాల్లో కూడా అఘాయిత్యాలు తగ్గడం లేదు. కొండపై ధ్యానానికి విదేశీయులు చాలా మంది వస్తుంటారు. పోలీసుల కథనం ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలై ను సందర్శించారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలోని ఓ మహిళను గైడ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను సందర్శించారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలోని ఓ ప్రైవేటు ఆశ్రమంలో బస చేశారు. దేవాలయం వెనుక ఉన్న కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తూ వచ్చేవారు ఇందుకోసం గైడ్ సాయం కూడా తీసుకున్నారు.
మూడు రోజుల క్రితం ఇలానే గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేసి వస్తుండగా గైడ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు . బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.