rangareddy: పందెంకోళ్లు వేలం కోసిన కోర్టు ..ఒక్కో కోడి 19 వేల రూపాయిలే !

కోళ్లకు ఇంత ధర పలకడంతో జడ్జి తో పాటు అధికారులు ఆశ్చర్యపోయారు.


Published Feb 19, 2025 06:54:00 PM
postImages/2025-02-19/1739971582_cockfighting1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామపరిధిలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫాంహౌస్ లో ఈ నెల 11 న పట్టుకున్న పందెం కోళ్లకు రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో వేలం పాట నిర్వహించారు. కోళ్లను దక్కించుకోవడానికి సుమారు 73 మంది వచ్చినట్లు సమాచారం. మొత్తం 84 కోళ్లను తొమ్మిది రౌండ్లలో వేలం వేశారు. సుమారు 16 లక్షల 65 వేలు ధర పలికింది. సగటున ఒక్కో కోడి రూ. 19వేల 821 రూపాయిలకి వేలం పలికింది. వేలం పాట ముగిసిన వెంటనే డబ్బు చెల్లించడానికి అందరు డబ్బు సంచులతో రావడం కోర్టు వారిని మరింత ఆశ్చర్యపరిచింది. కోళ్లకు ఇంత ధర పలకడంతో జడ్జి తో పాటు అధికారులు ఆశ్చర్యపోయారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu auction chicken east-godavari

Related Articles