viral: పబ్జీ గేమ్ లో ఫ్రీ ఫైర్ గొడవ ...రోడ్డు పై కొట్టుకున్న కుర్రాళ్లు !

అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి త్రీటౌన్ పోలీసులు ఇళ్లకు పంపించారు


Published Feb 19, 2025 12:03:00 PM
postImages/2025-02-19/1739947189_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్ కోసం విద్యార్ధులు గొడవపడ్డారు. ఈ ఘటన ఏపీ లో ఏలూరు లో బుధవారం ఉదయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు విద్యార్థులు పబ్జీ గేములో ఫ్రీ ఫైర్ ఆడే సమయంలో గొడవకు దిగినట్లు తెలిసింది.ఆ వివాదం కాస్త ముదరడంతో ఏలూరులోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా గల రోడ్డులో గుంపులుగా విద్యార్ధులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి త్రీటౌన్ పోలీసులు ఇళ్లకు పంపించారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students viral-video

Related Articles