కుంభమేళాలో జనవరి 29 వ తేదీన జరిగిన తొక్కిసలాటలో చనిపోయాడని అధికారులు ప్రకటించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కుంభమేళా తొక్కిసలాటలో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారి కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. 13 రోజులు పాపం ఎంత ఏడ్చిఉంటారో..కట్ చేస్తే నిజానికి ఆ వ్యక్తి చనిపోలేదు. బతికే ఉన్నాడు. తిరిగి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యుల ఆనందం చూడాలి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. చాచంద్ గలీకి చెందిన కుంతిగురు ..కుంభమేళాలో జనవరి 29 వ తేదీన జరిగిన తొక్కిసలాటలో చనిపోయాడని అధికారులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుంతిగురు ఫొటోకు దండవేశారు. కర్మలు జరిపించారు. తీరా చూస్తే 13 రోజులకు సంతాపసభ ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర కర్మలకు ఏర్పాటు చేశారు.
బంధువులంతా తన ఇంటి ముందుంటే చనిపోయాడనుకున్న వ్యక్తి నడిచివచ్చాడు. బంధువులంతా బిత్తరపోయారు. నిజానికి కుంతిగురు చనిపోలేదు. బతికే ఉన్నాడు ఈ 13 రోజులు సాధువులతో ..ధ్యానం చేస్తూ ఉన్నాడట. మనసు ప్రశాంతంగా ఉండడంతో ఇన్ని రోజులు వారితో ఉన్నానని తెలిపాడట.మీరంతా ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు. బంధువులంతా ఏం చెప్పాలో తెలీక అవాక్కయ్యారు. అంతే.. కుంతి గురుని సజీవంగా చూసి.. బంధువుల నోళ్లు పడిపోయాయి. వారి నోట మాట రాలేదు.ఏదైతేనేం బతికి రావడంతో చాలా హ్యాపీగా పీలయ్యారు.