Zoo Park: షాద్‌నగర్‌కు జూపార్క్‌ తరలింపు 2024-06-19 15:40:08

 

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్‌ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు వార్తు వస్తున్నాయి. కాలుష్యం సాకుతో తరలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పార్క్‌ను తరలిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. 1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే 2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంశం మళ్లీ తెరమీదికి రావడం చర్చనీయాంశంగా మారింది.