IND vs PAK : ఏంది సామి ఊరికే అలా రన్స్ ఇచ్చేస్తున్నావ్ ..నెటిజన్ల కామెంట్లు !

ఈ మ్యాచ్ కాని ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటికి వచ్చేయడమే సో ఈ మ్యాచ్ చాలా కీలకం ..పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


Published Feb 23, 2025 03:11:00 PM
postImages/2025-02-23/1740303785_cr20250223tn67babf173ea74.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా  భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకోవాలని భారత్ ఆరాటపడుతుంది. మరో వైపు ఈ మ్యాచ్ లో ఎలగైనా విజయం సాధించి టోర్నీలో నిలవాలని పాక్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కాని ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటికి వచ్చేయడమే సో ఈ మ్యాచ్ చాలా కీలకం ..పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


భార‌త తుది జ‌ట్లులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. బంగ్లాదేశ్‌తో ఆడిన జ‌ట్టునే కొన‌సాగిస్తోంది. అటు పాకిస్తాన్ మాత్రం ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. ఓపెన‌ర్ ఫ‌ఖార్ జ‌మాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హ‌క్ వ‌చ్చాడు.


తొలి ఓవ‌ర్‌ను టీమ్ఇండియా సీనియ‌ర్ పేస‌ర్ ష‌మీ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ష‌మీ 11 బంతుల‌ను వేశాడు. ఇందులో ఐదు వైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బాల్ కు ఇమామ్ ఎదుర్కొన్నాడు కాని ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతిని షమీ వైడ్ వేశాడు. ఆ తర్వాత రన్స్ రాలేదు. ఆ తర్వాత లైన్ రెండు వైడ్స్ ఆ తర్వాత ఓవర్ లో లాస్ట్ బంతికి లైన్ గా రెండు వైడ్స్ వేశాడు . దీంతో ఈ ఓవర్ లో ఆ పరుగులు వచ్చాయి. ఇందులో ఐదు వైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓవర్ ఇలా ముగిసింది.0, Wd, 0, Wd, Wd, 0, 1, 0, Wd, Wd, 0,తొలి ఓవ‌ర్ పూర్తి అయ్యే స‌రికి పాక్ స్కోరు 6/0. ఇమామ్ ఉల్ హ‌క్ (1), బాబ‌ర్ ఆజామ్ (0) క్రీజులో ఉన్నారు. దీని నెటిజన్లు ఫుల్ ఫన్ చేస్తున్నారు. ఇలాగైతే ఎలాగ‌య్యా.. వైడ్స్ వేసి పాక్ బ్యాట‌ర్లను కుదురుకునేట‌ట్లు చేయ‌వ‌ద్ద‌ని, ఇలాంటి పిచ్‌పై ఎక్స్‌ట్రా లు ఇవ్వ‌కూడ‌ద‌ని అంటున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : shami championship-trophy pakistan cricket-player

Related Articles