youtuber: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ని అరెస్ట్ చేసిన పోలీసులు !

అయితే వాళ్లు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలా జనాల ప్రాణాలతో ఆడుకోవడం అన్యాయమని తెలిపారు. 


Published Feb 24, 2025 12:51:00 PM
postImages/2025-02-24/1740381749_LocalBoyNani.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగు యూట్యూబర్ , మత్స్యకారుడు లోకల్ బాయ్ నానికి విశా సైబర్ క్రైం పోలీసులు షాక్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నందుకు గాను నాని ని అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అతనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్ధికంగా నష్టపోతున్నారని ..ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుధ్దమని సజ్జనార్ హెచ్చరించారు. అయితే వాళ్లు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలా జనాల ప్రాణాలతో ఆడుకోవడం అన్యాయమని తెలిపారు. 


సజ్జనార్ వీడియో వైరల్ కావడంతో లోకల్ బాయ్ నాని తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నాని ఈ వీడియో కు స్పందించి ..సజ్జనార్ సార్ కు సారీ చెప్పాడు. అంతేకాదు తను చదువుకోలేదని ...దాని వల్ల అంత నష్టం జరుగుతుందని తను అనుకోలేదని అన్నారు. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుటానని కూడా అన్నారు.  విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దీని పై రియాక్ట్ అయ్యారు.  కాని నానిపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21న కొంతమంది సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు.  అయితే యాప్ ను ప్రమోట్ చేసినందుకు నానికి చాలా పెద్ద మొత్తం లో డబ్బు అందినట్లు తెలిపారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి  రిమాండ్ కు పంపించారు.

newsline-whatsapp-channel
Tags : police visakhapatnam nani youtuber boys cyber-security

Related Articles