Gruop 2 Exam: తలపై జీలకర్ర బెల్లంతో గ్రూప్ 2 రాసిన నవవధువు !

ఈ పరీక్షకు దాదాపు 92, 250 మంది అభ్యర్ధులు రాయనున్నారు. దీని కోసం ఏపీ పీఎస్సీ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది.


Published Feb 23, 2025 12:43:00 PM
postImages/2025-02-23/1740294813_cr20250223tn67babf173ea74.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వివాదాలు , గందరగోళ పరిస్థితుల మధ్య ఏపీ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ పరీక్షకు దాదాపు 92, 250 మంది అభ్యర్ధులు రాయనున్నారు. దీని కోసం ఏపీ పీఎస్సీ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది.


అయితే ఈ పరీక్షకు ఓ నవవధువు తలపై జీలకర్ర , బెల్లంతో ..కళ్యాణం చీరతో హాజరుకావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఆమెను చూశారు. తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ లో ఈ సీన్ కనిపించింది. తిరుపతికి చెందిన నమితకు ఈ రోజు తెల్లవారుజామున పెళ్లైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం , పెళ్లి బట్టలతో ఎగ్జామ్ సెంటర్ కు వచ్చేసింది. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


అయితే రోస్టర్ విధానంలో ఎగ్జామ్ వాయిదా వెయ్యాలని కోరారు కాని రాష్ట్రంలో చాలా చోట్ల అందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరీక్షను వాయిదా వేయమని ఏపీపీఎస్సీని కోరింది. కాని రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని వల్ల గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding comptetive-exams tirumala

Related Articles