మళ్లీ అవసరానికి అవే కొని తింటాం. ఇది కామన్ గా జరిగేదే ఇది. కాని అసలు ఎలా తయారుచేస్తారో చూద్దాం..ఓ ఐడియా కోసం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. ప్రతిది కల్తీ లేని రోజుల్లో బతుకుతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ...మనం తినేది చెత్త అని తెలిసే తింటున్నాం. అలా వరస్ట్ లో వరస్ట్ ఫుడ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం చూస్తే చిరాకు పుడుతుంది. కాని మళ్లీ అవసరానికి అవే కొని తింటాం. ఇది కామన్ గా జరిగేదే ఇది. కాని అసలు ఎలా తయారుచేస్తారో చూద్దాం..ఓ ఐడియా కోసం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో దారుణాలు వెలుగు చూశాయి.. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న ముఠా బాగోతం బట్టబయలైంది..కాళ్లకు షూస్ వేసుకొని వాటితో తొక్కుతూ ...అల్లం బదులు అరటి బోదలు వాడుతూ ...వెల్లుల్లి లో పాడైన వెల్లుల్లి వేసి పేస్ట్ తయారుచేస్తారు.
మనలో కొంతమంది ఆ షూస్ ప్రత్యేకంగా వాటిని తయారుచేయడానికే వాడుతున్నారని అంటారేమో....వాటికోసమే వేసుకున్నా...వాడు నాలుగు అడుగులు బయటకు నడిచి మళ్లీ అదే అల్లం పేస్ట్ లో అడుగులు వేస్తాడు. షూతో అల్లం, వెల్లుల్లిని అలానే తొక్కుతూ.. మిగిలిన పొట్టు, చెత్తను నాలాలోకి వదలిస్తున్నారు తయారీదారులు..దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.