Red Ants Chutney: చీమల చట్నీ..చపాతీ...పర్ఫెక్ట్ కాంభినేషన్ !

Published 2024-07-06 15:35:40

postImages/2024-07-06/1720260340_RedAntChutney.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మీకు తెలుసో లేదో...చాలా మంది చీమలు అన్నం లో పడితే తిను...ఏం కాదు కళ్లు బాగా కనిపిస్తాయి అంటుంటారు. ఛీ అంటూనే తింటూ ఉంటాం ..అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు..కాని చీమలు కుట్టేస్తే మండుతుంది..నొప్పి ..దురద అందుకు దూరంగా ఉంటాం. ఒడిశా, ఛత్తీస్ గఢ్, పరిసర అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలకు మాత్రం ఎర్రచీమలంటే భయం లేదు . చీమలతో వంటకాలు కూడా చేస్తారు. అసలు ఎలా చేస్తారనే వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.


ఫుడ్ గయ్ రిషీ పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటంబం ఎర్ర చీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఇప్పుడు ఆ చట్నీ ఫుల్ ట్రెండ్ లో ఉంది. ఓ మహిళ చెట్టుపై ఉన్న ఎర్ర చీమల గూడును పొడవాటి కర్ర సాయంతో తెంపి నేలపై పరిచిన బట్టపై పడేసింది. ఆ గూడులో తెల్లటి చీమ గుడ్లు కూడా ఉన్నాయి.  ఆ వెంటనే దాన్ని ఓ డబ్బాలో వేసింది. అనంతరం వాటిని ఓ పళ్లెంలో వేసి అందులోంచి చెత్తా చెదారాన్ని తీసేశారు. చివరగా రోట్లో కాసిని ఎండుమిర్చి, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డలు వేసి దంచి ఆ మిశ్రమంలో ఎర్ర చీమలు, కాస్త నీరు కలిపి మళ్లీ దంచింది. అసలు ఈ చట్నీ చపాతీల్లోకి అధ్భుతంగా ఉంటుంది.


ఎర్ర చీమల చట్నీ జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని స్థానికులు చెప్పారని వీడియోలో వ్లాగర్ పేర్కొన్నాడు. కాని చీమల వల్ల చాలా హల్త్ బెనిఫ్ట్స్ ఉన్నాయంటున్నారు గిరిజనులు. కాని నెటిజన్లు మాత్రం చీమలు కూడా వదలరా స్వామి అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు ఒడిశాలో ప్రజాదరణ పొందిన ఎర్ర చీమల చట్నీకి ఈ ఏడాది జనవరి 2న ప్రతిష్టాత్మక జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ లభించింది. ఒరిస్సాలో ఈ చట్నీ ని కాయ్ చట్నీ అని కూడా అంటారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishi Praveen | Foodguyrishi


Tags : newslinetelugu viral-news health

Related Articles