ఈ వార్తలపై బుధవారం నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు.
న్యూస్ లైన్ సినిమా: జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నవీన్ చేతికి ఫ్యాక్చర్ అయ్యిందని దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు సూచించినట్లు టాక్ వచ్చింది. అయితే ఈ వార్తలపై బుధవారం నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు. మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది.
‘‘నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను’’ అంటూ నవీన్ తన పోస్టులో రాసుకొచ్చాడు.
Tags : india-people tollywood hero-