cinema: ఒక్కో ఇండస్ట్రీకి ఎన్ని కోట్ల నష్టాలో తెలుసా ..హిట్లు తక్కువ.. ఫట్లు ఎక్కువ!

మళయాళ ఇండస్ట్రీ కూడా ఇటీవల భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. భారీ బడ్జెట్ సినిమాలు  ఎన్నో ప్లాన్ చేస్తే ...సూపర్ డూపర్ అయినవి చిన్న సినిమాలే. ఆ నష్టం కోట్లలో నష్టం.


Published Feb 16, 2025 05:54:00 PM
postImages/2025-02-16/1739708689_ActorspaymentforbesList.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సింగిల్ హిట్ ..అరడజన్ ఫ్లాపులు లాస్ట్ ఇయర్ అంతా ఇండస్ట్రీ పరిస్థితి ఇదే. పాపం టాలీవుడ్ ఒక్కటే కాదు బాలీవుడ్‌ నుంచి మాలీవుడ్ వరకు దాదాపుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. స్టోరీ సెలక్షన్‌, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో పాన్ ఇండియా లెవల్‌లో ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేస్తున్న మళయాళ ఇండస్ట్రీ కూడా ఇటీవల భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. భారీ బడ్జెట్ సినిమాలు  ఎన్నో ప్లాన్ చేస్తే ...సూపర్ డూపర్ అయినవి చిన్న సినిమాలే. ఆ నష్టం కోట్లలో నష్టం.


2024లో 650 నుంచి 7వందల కోట్ల వరకు మళయాళ ఇండస్ట్రీ నష్టపోయింది. మలయాళంలో 2024లో మొత్తం 204 సినిమాలు రిలీజ్‌ అయితే అందులో 26 మాత్రమే హిట్టు అయ్యాయి. వెయ్యి కోట్ల సినిమాలు చేస్తే కలక్షన్లు మాత్రం జస్ట్ 350 కోట్లు మాత్రమే. మోహల్‌లాల్‌ భారీ ప్రాజెక్ట్‌ బరోజ్‌ పెద్ద దెబ్బ వేయగా, మలైకొట్టి వాలిబన్‌, మళయాళీ ఫ్రమ్ ఇండియా, కొండల్‌ లాంటి హై బడ్జెట్ మూవీస్‌ అట్టర్‌ఫ్లాప్‌లుగా మిగిలిపోయాయ్.నిజానికి తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ తో పోలిస్తే మలయాళం ఇండస్ట్రీకి నష్టం తక్కువే . కాని మలయాళం ఇండస్ట్రీ కి ఈ నష్టం చాలా ఎక్కువ.


 మళయాళీ మూవీస్ అంటే తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్‌తో కంప్లీట్ చేస్తారనే పేరు ఉంది. ఇప్పుడు వాళ్లు కూడా రిస్క్ తీసుకొని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఒక్క ఏడాదే 7వందల కోట్ల నష్టం అంటే మాలీవుడ్ కోలుకోవడానికి చాలా టైమ్ పట్టే చాన్స్ ఉంటుంది. ఇటీవల పెరిగిన యాక్టర్ల రెమ్యునరేషన్లకు తోడు కేరళలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ దెబ్బకు జూన్ ఫస్ట్ నుంచి మాలీవుడ్ నిరసనలకు రెడీ అయ్యింది. ఓటీటీ పెద్ద సినిమాలకే పెద్ద పీట వేస్తుంది. చిన్న సినిమాలకు పెద్దగా డబ్బు రావడం లేదు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి.  నష్టాలు కూడా పెరుగుతున్నాయి.  దీనిని భరించలేక షూటింగ్స్, సినిమా హాళ్లు బంద్ అని ప్రకటించాయి. 


తమిళ ఇండస్ట్రీది సేమ్ . 2024లో 3వేల కోట్లు ఖర్చు చేస్తే వెయ్యి కోట్లకు పైగా నష్టమే మిగిలింది. గతేడాది ఓవరాల్‌గా 241 సినిమాలు రిలీజ్ అయితే తమిళ్ లో 18 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయ్‌. ఒక్క ఇండియన్ టూ , రజినీ కాంత్ వేట్టయాన్ , ఈ సినిమాలతోనే దాదాపు 400 కోట్లు నష్టం. 2025 మీద కోలీవుడ్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. అజిత్‌ గుడ్ బ్యాడ్ అగ్లీ, రజనీకాంత్ కూలీ, కమల్‌హాసన్‌ థగ్ లైఫ్‌, సూర్య రెట్రోతో పాటు శివకార్తికేయన్ మూవీ కూడా రాబోతోంది. వీటి మీదే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది.


బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ మూవీస్‌ ఘోరంగా బోల్తా పడ్డాయ్‌. ఓ రేంజ్‌ అంచనాలతో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్‌, జిగ్రా, సర్‌ఫిరా.. లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోయాయ్. ఈ ఏటాది చావాతో మంచి ఓపెనింగ్‌ వచ్చినా బాలీవుడ్ ఇది కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది డౌటే. బాలీవుడ్ కూడా భారీ నష్టాల్లోనే ఉంది. 


టాలీవుడ్ పరిస్థితి కాస్త వేరు. మన సినిమాలు హై బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ట్ కొట్టింది. హనుమ్యాన్‌ నుంచి కల్కి, దేవర పార్ట్‌ 1.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయ్‌. ఇక పుష్ప 2 వరకు నమ్మి తీసినందుకు పెట్టిన దాని కంటే డబుల్ లాభాలు వచ్చాయి. మరికొన్ని చిత్రాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను మిగిల్చాయ్‌. గేమ్ ఛేంజర్ నష్టాలే మిగిల్చింది.సినిమా బడ్జెట్‌లో దాదాపు 60శాతం హీరోకు రెమ్యునరేషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. 1960 నుంచి 1990 మధ్య సినిమాకు గోల్డెన్ ఎరా. ప్రతీ ఒక్కరి రెమ్యునరేషన్‌ను నిర్మాతే డిసైడ్ చేసేవాడు. ఇప్పుడు సినిమా బడ్జెట్టే  హీరో డిసైడ్ చేస్తున్నాడు. ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోను కోట్లలో నష్టాలు చూస్తున్నారు నిర్మాతలు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood movies bollywood-

Related Articles