సినిమాల విషయానికి వస్తే పుష్ప 3 కూడా అనౌన్స్ చేసారు కాబట్టి అందులో ఏమైనా ధనంజయ్ కి ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పుష్ప రెండు సినిమాల్లోను జాలిరెడ్డి క్యారక్టర్స్ చేసిన ధనంజయ్ 35 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అయ్యాడు. ధనంజయ్ పెళ్లి ధన్యత అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. పుష్ప 2 చిత్రాల్లో జాలిరెడ్డి పాత్రలో నటించిన నటుడు ధనంజయ్ 38 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఫ్యాన్స్ అతడిని దాళి అని పిలుస్తుంటారు. జాలి రెడ్డి పెళ్లి పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాల విషయానికి వస్తే పుష్ప 3 కూడా అనౌన్స్ చేసారు కాబట్టి అందులో ఏమైనా ధనంజయ్ కి ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలి.
ధనంజయ్, గైనకాలజిస్ట్ ధన్యతని పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు సినిమాలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో సహా చిత్ర, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాలు పంపారు. ధన్యత ..ధనంజయ్ ఫ్యాన్ . ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్ కూడా. అతని గ్రామం కలెనహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కొత్త టైల్స్, వాల్ పెయింట్, నీటి వ్యవస్థ, పగుళ్లు బారిన పడిన గోడలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు.ధనుంజయ్ ఇలాంటి చారిటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇలా తన పనులు , క్యారక్టర్ నచ్చి ధన్యత, ధనంజయ్ కి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు.