సెక్రటేరియట్‌లో కల్తీ ఆహారం..!


Published Feb 16, 2025 01:13:17 PM
postImages/2025-02-16/1739691797_hy05hyderabadBuildingnewSecretariatcomplex.jpeg

సెక్రటేరియట్‌లో కల్తీ ఆహారం

వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు

బెంబేలెత్తుతున్న సీఎంవో, మంత్రుల పేషీల సిబ్బంది

బయటి రాష్ట్రాల అతిథులకూ అదే భోజనం

కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు

రంగంలో దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్

 

సెక్రటేరియట్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గురుకులాలు, పాఠశాలలకే పరిమితమైన కల్తీ ఆహారం ఘటనలు తాజాగా రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్‌లోనూ చోటు చేసుకోవడం సంచలనంగా మారాయి. సీఎంవో, మంత్రుల పేషీలకు సరఫరా చేసే భోజనం నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు అధికారులు ఫుడ్ పాయిజన్‌కు గురికావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.  

 

తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 15): తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌కు ఫుడ్ పాయిజన్ కష్టాలు తప్పడం లేదు. నాసిరకం భోజనం సప్లైతో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీఎంఓతో సహా మంత్రుల పేషీలకు అదే భోజనం సప్లై అవుతోంది. సీఎస్ స్థాయి నుండి పలు కీలక శాఖల అధికారుల వరకు అందరూ అదే భోజనం తింటున్నారు. నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్న సంస్థపై పలువురు సిబ్బంది ఇప్పటికే ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలు శూన్యమని సెక్రటేరియట్ సిబ్బంది ఆవేదన చెందారు. కొందరు అధికారులు వారి ప్రయోజనాల కోసం తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.

 

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రముఖులకు కూడా ఇదే భోజనం వడ్డిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఫుడ్ పాయిజన్ కష్టాలతో ప్రోటోకాల్ ఫుడ్ మానేసి తమ సొంతంగా పలువురు మంత్రులు, వారి పేషీ సిబ్బంది భోజనం తెప్పించుకుంటున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నాసిరకం భోజనం సప్లై ఇష్యూ రావడంతో, విచారణకు ఆదేశించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రంగంలోకి దిగి, సెక్రటేరియట్‌కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఏజెన్సీ కిచెన్‌లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల ముడిసరుకులు, ఆహార నాణ్యతను ఫుడ్ సేప్టీ ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. రిపోర్టును త్వరలో సంబంధిత అధికారులకు ఇవ్వనున్నారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress telanganam government

Related Articles