డమ్మీ సీఎం ..!


Published Feb 16, 2025 12:55:36 PM
postImages/2025-02-16/1739690736_WhatsAppImage20250216at12.35.44PM.jpeg

డమ్మీ సీఎం

పవర్ ఫుల్ ఇంఛార్జ్

 

మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతల అప్పగింతపై సర్వత్రా చర్చ

ఇంఛార్జ్‌గా రాహుల్ రాహుల్ మనిషి

సీఎం పవర్స్‌కు కత్తిరింపు

ఇకపై సొంత నిర్ణయాలు ఉండవు!

గతి తప్పుతున్న పార్టీని గాడిన పెట్టే యత్నం

పూర్తిస్థాయిలో పార్టీపై పట్టు పెంచుకోనున్న అధిష్ఠానం

పార్టీకి ఆదరవుగా నిలుస్తున్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్

ఎప్పటికప్పుడు పరిస్థితుల సమీక్ష

హైకమాండ్‌కు రిపోర్ట్ పంపనున్న మీనాక్షి

 

కాంగ్రెస్‌కు తెలంగాణ, కర్ణాటక రాజకీయంగా కీలకమైన ప్రాంతాలు. ఇవి చేజారితే ఇక అంతేసంగతులు. ముఖ్యంగా తెలంగాణను వదులుకోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అస్సలు సిద్ధంగా లేదు. కానీ, ఇక్కడి పరిస్థితులు, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, అందుతున్న రిపోర్టులు అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత కీలక నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. గతి తప్పుతున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికే ఆమెను రాష్ట్రానికి పంపుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. తోకజాడిస్తున్న నాయకుల పవర్స్ కట్ చేసి, పవర్ ఫుల్ పర్సన్‌కు బాధ్యతలు అప్పగించారన్నది ఢిల్లీ వర్గాల టాక్.

 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 15): దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఆదరవు తెలంగాణ. హస్తం పార్టీకి బలమైన ఆర్థిక వనరు ఇదేనన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారుతోందన్న ఆందోళన హైకమాండ్‌లో కలుగుతోంది. ఒంటెద్దుపోకడల ముఖ్యమంత్రి, సఖ్యతలేని మంత్రివర్గం, ఎమ్మెల్యేలలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. భవిష్యత్తులో అధికారం కల్ల అనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని, తన టీమ్‌ మెంబర్‌గా పేరున్న మీనాక్షి నటరాజన్‌కు రాష్ట్ర ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడానికి, పార్టీ నిబంధనలను అతిక్రమిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవనే స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే మీనాక్షికి బాధ్యతలు అప్పగించారని చర్చ జరుగుతోంది.

 

సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయని హైకమాండ్‌కు పలు దఫాలుగా నివేదికలు వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో పాలనాపర అంశాలకంటే కూడా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం, అధికారాన్ని తన స్వలాభం కోసం వినియోగించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పడం తదితర అంశాలు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అవ్వడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఢిల్లీకి పలుమార్లు వెళ్లినా.. ఏనాడు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా కూడా చెబుతున్నారు. దాదాపు 32 సార్లు ఢిల్లీ వెళితే.. 31 సార్లు రాహుల్ గాంధీని కలిసే ఛాన్స్ దొరకలేదు. అయితే ఎట్టలకేలకు 32వ సారి శనివారం ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట ఇవ్వడం విశేషం. అది కూడా మీనాక్షి నటరాజన్‌ అంశం మాట్లాడటానికే ఆయనకు అవకాశం ఇచ్చారని సమాచారం. రాష్ట్రంలో పార్టీ అదుపుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, నటరాజన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పినట్టుగా తెలుస్తుంది.

 

మీనాక్షి నటరాజన్‌ ఎంపిక వ్యూహాత్మకంగా జరిగిందన్న చర్చ జరుగుతోంది. హైకమాండ్ పెద్దల మనిషిగా ఆమెకు పేరుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలు. దేశంలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్న సమయంలో తెలంగాణ కొత్త ఊపిరిపోసింది. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్‌పై రోజురోజుకూ ప్రజావ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నదని సమాచారం. ముక్కుసూటి మనిషిగా, నిజాయితీపరురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్‌కు రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తే, పరిస్థితిని అదుపు చేయొచ్చని భావిస్తుందట. సీఎం కుటుంబం, మంత్రుల అవినీతిపై దృష్టిపెట్టాలని అధిష్ఠానం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అంతేగాక ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు అంశాన్ని కూడా పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరగడానికి గల కారణాలపై హైకమాండ్ దృష్టిపెట్టిందని, మీనాక్షి వాటిపై కూడా డిటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనున్నారని సమాచారం.

 

రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ పెరడానికి శాయశక్తుల కృషి చేయాలని నమ్మినబంటు మీనాక్షి నటరాజన్‌కు రాహుల్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి పవర్స్ తగ్గించి, ఇంఛార్జ్ పవర్స్ పెంచడమే పార్టీ ఆలోచనగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. గత ఇంఛార్జులతో సీఎం అండ్ కో కుమ్మక్కయ్యి, తమకు అనుకూలంగా మార్చుకున్నారని, వాస్తవాలు బయటకు రాకుండా జాగ్రతపడ్డారని అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఇంఛార్జ్ పదవిలో మార్పు చోటుచేసుకుందని అంటున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజావ్యతిరేకత నుంచి బయటపడటానికి ఏమేం చేయాలన్న దానిపై హైకమాండ్ దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రికి అధికారాలు కత్తిరించి, పీసీసీ చీఫ్, తదితర పదవుల్లో పార్టీకి నిబద్ధతగా పని చేసేవారిని నిలబెట్టాలనుకుంటున్నారని సమాచారం.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy telanganam rahul-gandhi

Related Articles