REVANTH REDDY: బీఆర్ఎస్‌ను ఫినిష్ చేద్దాం!

సీఎం రేవంత్ రెడ్డి పరిపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధమయ్యారన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. ఎలాంటి అధికార ప్రకటన లేకుండా, ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ, ఒకపక్క రైతుల అవస్థలు, మరోపక్క ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా.. ఒక్కసారిగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడంలోని లోగుట్టు ఇదేనని తెలుస్తోంది.


Published Feb 27, 2025 01:14:00 PM
postImages/2025-02-27/1740642349_deccanherald2024076eb294f5982445d29ca894eee11ac2f2file7w5ev81sq1t10k5ybgzf.avif

గంటన్నర సేపు చర్చించుకున్న పీఎం, సీఎం!


బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు


కేసీఆర్ బలంగా ప్రజల్లోకి పోతున్నడు


ఇక వదలొద్దు.. ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే


రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తవో ఎంత టైట్ చేస్తవో చెయ్


నువ్వు సీబీఐకి ఎంట్రీ ఇవ్వు


మిగతాదంతా మేం చూసుకుంటాం


నా సహాయ సహకారాలు నీకుంటయ్


రేవంత్‌కు ఫుల్ భరోసా ఇచ్చిన ప్రధాని మోడీ?
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 26): ప్రధాని మోడీ.. సీఎం రేవంత్ రెడ్డి.. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటన్నర సేపు మోదీ, రేవంత్ మధ్య చర్చ జరిగింది. గతంలో ఏ బీజేపీ సీఎంతో కూడా ఆయన ఇంత సేపు భేటీ కాలేదు. మిత్రపక్ష సీఎంలతో కూడా భేటీ అయ్యింది లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీఎంతో ప్రధాని మోడీ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయడమే లక్ష్యంగా ఎత్తులు పైఎత్తులకు వేదికగా నిలిచింది. పార్టీని విలీనం చేయడానికి ససేమీరా అంటున్న కేసీఆర్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలన్న ప్రధాని మోడీ ఆలోచనలకు, సీఎం రేవంత్ రెడ్డి పరిపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధమయ్యారన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. ఎలాంటి అధికార ప్రకటన లేకుండా, ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ, ఒకపక్క రైతుల అవస్థలు, మరోపక్క ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా.. ఒక్కసారిగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడంలోని లోగుట్టు ఇదేనని తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను కేసుల్లో ఇరికించడం, దానికి పైనుంచి కావలసిన సాయాన్ని పొందడం కోసమే సీఎం వెళ్లారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారన్న విషయం ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. మంగళవారం సాయంత్రం వరకు ఎవరికీ తెలియదు. రాహుల్ దగ్గరకు వెళ్తున్నారనే అంతా అనుకున్నారు. మోడీని ఎప్పుడు అపాయింట్ మెంట్ అడిగారో కూడా ఎవరికీ తెలియదు. ఇంత గోప్యంగా ఇద్దరు నేతలు మాట్లాడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పలు సందేహాలను కూడా రేకెత్తిస్తోంది. తెలంగాణంలో కేసీఆర్ బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నాడని, కట్టడి చేయాల్సిందేనని ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంత వరకు అయితే అంత వరకు కట్టడి చేస్తే, కేంద్రం నుంచి తాను అంతకు రెట్టింపు సాయం చేస్తానని రేవంత్‌కు మోదీ హామీ ఇస్తానని తెలిపారట. 

కేంద్రం నుంచి సీబీఐ ఎంక్వయిరీ చేపట్టేలా చేసి, బీఆర్ఎస్‌ను ఎక్కడికక్కడ కేసుల్లో ఇరికించడానికి ఇరువురి నేతల పన్నాగమన్న చర్చ జరుగుతోంది. సీబీఐకి తెలంగాణలో ప్రవేశం లేకుండా గతంలో బీఆర్ఎస్ సర్కార్ నిషేధం విధించింది. రాజకీయ ప్రత్యర్థులపై సబీఐని వినియోగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మోడీ కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల్లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy newslinetelugu brs central-government narendra-modi

Related Articles