అమెరికా లో ఓ పిజ్జా డెలివరీ మహిళ కేవలం 2 డాలర్ల టిప్ ఇచ్చిందని ..తనకు ఇంకా కావాలని కోరుతూ పిజ్జా డెలివరీ గర్ల్ ఓ గర్భవతితో గొడవపడింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనుషులు మరీ దారుణంగా తయారవతున్నారు. అసలు కడుపుతో ఉన్నవాళ్లని చూస్తే తెలియని భయం మొదలవుతుంది. అమ్మో మన వల్ల వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అని .. కాని మరీ జాలి లేకుండా స్వార్ధపరులుగా ఉండడం మాత్రం కొన్ని సార్లు మనసు కలిచివేస్తుంది. అమెరికా లో ఓ పిజ్జా డెలివరీ మహిళ కేవలం 2 డాలర్ల టిప్ ఇచ్చిందని ..తనకు ఇంకా కావాలని కోరుతూ పిజ్జా డెలివరీ గర్ల్ ఓ గర్భవతితో గొడవపడింది. ఆ గొడవలో భాగంగా.. కత్తితో 14 సార్లు పొడిచింది.
ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో ఓ కుటుంబం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసుకుంది. వచ్చిన బంధువులలో ఒకరి కోసం పిజ్జా ఆర్డర్ చేయగా... బ్రియన్నా అల్వెలో అనే డెలివరీ గాళ్ పిజ్జా తీసుకొచ్చింది. బిల్లు 33 డాలర్లు కాగా 50 డాలర్ల నోటు ఇస్తే చిల్లర లేవని డెలివరీ గర్ల్ చెప్పింది. దీంతో తన దగ్గర ఉన్న చిల్లరంతా వెతకగా 35 డాలర్లు ఇచ్చేసింది. టిప్ గా మరో రెండు డాలర్లను ఇచ్చింది. టిప్ చాలదని చెప్పింది ఆమె..దీనిపై కాస్త గొడవ జరిగింది.
చివరకు గొణుక్కుంటూనే అల్వెలో వెళ్లిపోయిందని, దాదాపు గంటన్నర తర్వాత మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చిందన్నారు. ఆ యువకుడి చేతిలో గన్, అల్వెలో చేతిలో కత్తి ఉన్నాయని చెప్పారు. రావడం రావడమే ఆ మహిళ గర్భిణి కడుపులో కత్తితో 14 సార్లు పొడిచింది. దీంతో బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. ఆమె డేంజర్ జోన్ లో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దాడి చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.