Panipuri: పానీపూరి లైఫ్ టైం సబ్ స్క్రిప్షన్ ..జస్ట్ 99 వేలే !

లైఫ్ టైం సబ్ స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాడు ఓ వ్యాపారి. మరి మార్కెటింగ్ ఈ రేంజ్ లో చేస్తేనే కదా యాపారం బాగా జరిగేది.


Published Feb 15, 2025 07:43:00 PM
postImages/2025-02-15/1739628880_viralpostofnagpurvendor1738757903688v.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:ఓటీటీ లాంటి వాటికి సబ్ స్క్రిప్షన్ విన్నాం కాని పానీ పూరీ కి ఏంటి సార్ అంటారేమో...డిజిటల్ యుగం మనం ఏమైనా వింటాం ..చూస్తాం. అసలే ఆడపిల్లకు ..పానీపూరీ అక్కచెల్లెళ్లు ..ఈ రోజుల్లో మేకప్ లేని ఆడపిల్లలైనా ఉంటారేమో కాని పానీపూరి తినని ఆడపిల్లలు చాలా చాలా చాలా తక్కువ. ఉన్నారంటే ...చుక్కల్లో చందమామ అనే చెప్పాలి. అయితే పానీపూరి తిన్న ప్రతిసారి 50 , 60 ఇవ్వకుండా ..లైఫ్ టైం సబ్ స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాడు ఓ వ్యాపారి. మరి మార్కెటింగ్ ఈ రేంజ్ లో చేస్తేనే కదా యాపారం బాగా జరిగేది.


నాగ్ పూర్ కు చెందిన ఓ వ్యాపారి జీవితాంతం పానీపూరీ ఉచితంగా తినడానికి రూ.99,000 చెల్లించాలని ఆఫర్ ప్రకటించాడు. లైఫ్ టైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు ఎప్పుడంటే అప్పుడు, ఎన్ని పానీపూరీలైనా తినవచ్చు. ఈ ఆఫర్ కు ఇద్దరు డబ్బులు కూడా కట్టారట. ఇవే కాదు ...ఒకే దఫాలో 151 పానీపూరీలు తింటే రూ.21,000 రివార్డ్ ఇస్తానని ప్రకటించాడు. 'మహాకుంభ్' ఆఫర్... ఈ ఆఫర్ కింద ఒకే దఫాలో ఒక వ్యక్తి 40 పానీపూరీలు తినగలిగితే రూ.1 చెల్లించవచ్చు. లాడ్లీ బెహెన్ యోజన ఈ స్కీం కింద పానీపూరీ తినడానికి వచ్చిన లేడీస్ జస్ట్ 60 రూపాయిలు కట్టి ఎన్నైనా తినచ్చు. జస్ట్ 195 చెల్లిస్తే అన్ లిమిటెడ్ పానీపూరీ తినచ్చు. ఇక ఈ ఆఫర్లకు కామెంట్లే హైలెట్. డబ్బు తీసుకొని జంప్ అయిపోతే ...ఏం చెయ్యాలి సార్ అని ఒకరు. ఇదేం ఆఫర్లు బాబాయ్ యాపారం మరీ అంత డల్ ఉందా అని మరికొందరు. చెప్తూనే ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news food,

Related Articles