rana వార్తలు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 AD మూవీ పై ప్రతి ఒక్కరికి భారీ హోప్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి..కల్కి.. అంటూ ఈ సినిమా పేరే మార్మోగిపోతుంది.ఈ సినిమా లో ఇప్పటికే ఎంతమంది స్టార్లు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ గురించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుబాటి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు లేటెస్ట్ గా ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తోంది.మహాభారతంలోని దుర్యోధనుడు పాత్రని కల్కి మూవీలో రానా దగ్గుబాటి పోషించినట్టు ఫిలిం సర్కిల్స్ నుండి  ఓ టాక్ వినిపిస్తుంది

న్యూస్ లైన్ డెస్క్: దగ్గుబాటి రానా అంటే అటు నార్త్ ఇటు సౌత్ లో పేరున్న హీరో.. ఈయన కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.అలా బాలీవుడ్ జనాలకు కూడా రానా సుపరిచితులు.ఇక ఇండస్ట్రీకి రాకముందు విజువల్ ఎఫెక్ట్ సమన్వయకర్తగా పనిచేసిన రానా ప్రస్తుతం సినిమాల్లో హీరోగా.. విలన్ గా.. రాణిస్తున్నారు. ఈయన బాహుబలి రెండు సిరీస్ లలో అలాగే భీమ్లా నాయక్ మూవీలో కూడా విలన్ గా చేశారు.

భారీ కటౌట్ తో ఉన్న రానా అటు విలన్ గా ఇటు హీరోగా బాగా సెట్ అవుతారు. ఇక ఈయన నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక దీనికి సంబంధించిన రెండో సిరీస్ కూడా త్వరలోనే రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికేగుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకష్యప,తేజ దర్శకత్వంలో రాక్షస రాజా వంటి రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నా రానా, ఈ రెండు మూవీస్ షూటింగ్స్ మాత్రం జరగడం లేదు.ప్రస్తుతం ఈ రెండు మూవీస్ హోల్డ్ లో ఉన్నాయి.

అయితే ఈ గ్యాప్ లోనే రానా మరో మూవీ లో హీరోగా నటించడానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆర్కా మీడియా వర్క్స్ నిర

advertisement