ACB: ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి

లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ACB: ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి
X

న్యూస్ లైన్ డెస్క్: లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి అవినీతి నోరధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా మల్లారెడ్డిపల్లి గ్రామం చింతపల్లి మండలంలో విద్యుత్ కనెక్షన్ అందించడానికి 20,000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంటింటికీ, వ్యవసాయ బోరు కోసం రెండు స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు కేబుల్స్‌ వేయడం ద్వారా విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు వేణు కుమార్ రూ. 20వేలు లంచం డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో వనస్థలిపురానికి చెందిన రావి సూర్యనారాయణ ఫిర్యాదు ఎసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారి నడింపల్లి వేణు కుమార్‌ను ఎసీబీ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

Tags:
Next Story
Share it