Bhadradri Kothagudem: స్టేషన్‌కి పిలిపించి బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టిన పోలీసులు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తుంది. తాజాగా ఓ బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్‌కి పిలిచి మరీ పోలీస్ అధికారులతో కొట్టించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది

Bhadradri Kothagudem: స్టేషన్‌కి పిలిపించి బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టిన పోలీసులు
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తుంది. తాజాగా ఓ బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్‌కి పిలిచి మరీ పోలీస్ అధికారులతో కొట్టించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో నిన్న (సోమవారం) పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ బూత్లో జరిగిన స్వల్ప ఘర్షణ విషయంలో స్టేషన్‌కు పిలిచి ఓ బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు కొట్టారు. మా కార్యకర్తను అన్యాయంగా కొట్టారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకుల నుంచి మాకు రక్షణ కల్పించాలని స్టేషన్‌కి వస్తే పోలీసులు కూడా పిలిచి మరీ కొట్టాడం ఏంటాని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

Tags:
Next Story
Share it