Mayor: కూలిన నాలా గోడలు.. పరిశీలించిన మేయర్

అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి.

Mayor: కూలిన నాలా గోడలు.. పరిశీలించిన మేయర్
X

న్యూస్ లైన్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad) పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌(Banjara Hills)లో వరద ధాటికి నాలా గోడలు కూలిపోయాయి. అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి. దీంతో ఉదయనగర్ కాలనీ(Udaya Nagar Colony)లోని నివాసాల్లో ఉండే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొట్టుకుపోయిన ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwala Vijayalakshmi) పరిశీలించారు. ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై GHMC ఇంజనీరింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

Tags:
Next Story
Share it