Harish Rao: ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో గాయపడిన వారిని పరామర్శించిన హరీష్ రావు

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బీఆర్ఎస్ నాయకుడు సిద్దిపేట్ట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు.

Harish Rao: ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో గాయపడిన వారిని పరామర్శించిన హరీష్ రావు
X

న్యూస్ లైన్ డెస్క్: సంగారెడ్డి హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బాయిలర్ పేలి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బీఆర్ఎస్ నాయకుడు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 25 లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. మృతదేహాలను స్వగ్రామానికి పంపడానికి అంబులెన్సులు సమకూర్చి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను ప్రభుత్వం, కంపెనీ భరించాలని అన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటీ వరకు, ౩౦ మందికి గాయలు, ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it