Rahul Gandhi: నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎంపీగా పోటిచేయనున్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్ జిల్లా ఎంపీగా ఆయన నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

Rahul Gandhi: నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎంపీగా పోటిచేయనున్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్ జిల్లా ఎంపీగా ఆయన నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు. వయనాడ్ నగరంలో భారీ రోడ్ షో నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటి చేసిన రాహుల్ గాంధీ.. వ‌య‌నాడ్ నుంచి ఎంపీగా గెలుపొంది.. అమోతీలో ఓడిపోయారు. మళ్లీ ఆ నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గానికి రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.." ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం, భారత రాజ్యంగం కోసం జరుగుతున్న పోరు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే శక్తులు ఒకవైపు ఉన్నాయి. మరొక వైపు, రాజ్యాంగాన్ని పరిరక్షించే, మన దేశ ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించే ఒక శక్తి ఉందని ఆయన అన్నారు."

Tags:
Next Story
Share it