Chalo Nalgonda: 'ఛలో నల్గొండ' బహిరంగ సభకు నేతలు

తెలంగాణ (telangana) మాజీ ఉప ముఖ్యమంత్రి ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (kadiyam sri hari) ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు బయలుదేరారు.

Chalo Nalgonda: ఛలో నల్గొండ బహిరంగ సభకు నేతలు
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ (telangana) మాజీ ఉప ముఖ్యమంత్రి ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (kadiyam sri hari) ‘ఛలో నల్గొండ’ బహిరంగ సభకు బయలుదేరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభకి భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం అని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిందని అన్నారు.

తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే తాము నల్గొండ సభకు వెళ్తున్నామని కడియం శ్రీహరి వివరించారు. ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజలు హాజరవుతున్నారని కడియం అన్నారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు కడియం శ్రీహరి అన్నారు.

Tags:
Next Story
Share it