Fire accident: రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ఘటనాస్థాలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

Fire accident: రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియా(Narela Industrial Area)లో గ్యాస్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థాలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it