Suicide: మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ఆటో నడుకుంటూ జీవనం సాగించే తమకు ఉచిత బస్సు పథకం వచ్చిన తరువాత ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు.

Suicide: మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
X

న్యూస్ లైన్ డెస్క్: ఆటోడ్రైవర్‌(Auto driver) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట(Siddipet) జిల్లా గజ్వేల్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఏడాదిన్నర నుండి ఆటో నడుపుతున్న స్వామి(33) బుధవారం రాజిరెడ్డిపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆటో నడుకుంటూ జీవనం సాగించే తమకు ఉచిత బస్సు పథకం వచ్చిన తరువాత ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. దీంతో అప్పులు చేయాల్సి వచ్చిందని.. వాటిని తీర్చే పరిస్థితి లేకపోవడంతో మనస్థాపం చెందిన స్వామి మంగళవారం ఇంట్లో నుండి వెళ్ళిపోయారని వెల్లడించారు. ఆందోళన చెంది అతన్ని వెతుక్కుంటూ వెళ్లేసరికే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it