Baby Movie: కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి' రీ రిలీజ్.. ఎప్పుడంటే?

'బేబి' సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న థియేటర్స్ లోకి రీ రిలీజ్ కానుంది.

Baby Movie: కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి రీ రిలీజ్.. ఎప్పుడంటే?
X

న్యూస్ లైన్ సినిమా: గతేడాది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'బేబి' సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న థియేటర్స్ లోకి రీ రిలీజ్ కానుంది. మేకర్స్ ఇవాళ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించారు. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది. గతేడాది జూలై 14న ప్రక్షకుల ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్ధంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది.

చాలారోజుల తర్వాత టాలీవుడ్ లో జెన్యూన్ ప్రేమకథతో సక్సెస్ అందుకుంది బేబి మూవీ. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి.. మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. ఓటీటీలోనూ పలు రికార్డులు క్రియేట్ చేసింది. కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వాలెంటైన్స్ డే రోజున యువ ప్రేక్షకులు, ప్రేమికులు చూసేందుకు బేబి ది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. లవర్స్ పూర్తిగా ఎంగేజ్ అయ్యే రోజు కాబట్టి ఈ ప్రేమికుల దినోత్సవం రోజు థియేటర్స్ లో 'బేబి' సందడి చేయబోతోంది.

Tags:
Next Story
Share it