BAI: థామస్ కప్ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించిన బీఎఐ.!

ఈ మెగా టోర్నీ కోసం గురువారం బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా పురుషుల‌, మ‌హిళ‌ల బృందాన్ని ప్ర‌క‌టించింది.

BAI: థామస్ కప్ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించిన బీఎఐ.!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఆసియాన్ గేమ్స్‌లో పతకలతో సత్తచాటి భార‌త ష‌ట్ల‌ర్ల‌ు మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నెల చైనాలో జ‌రుగ‌బోయే బీడ‌బ్ల్యూఎఫ్ థామ‌స్ క‌ప్, ఉబెర్ క‌ప్ ఫైన‌ల్స్ ఆడ‌నున్నారు. ఈ మెగా టోర్నీ కోసం గురువారం బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా పురుషుల‌, మ‌హిళ‌ల బృందాన్ని ప్ర‌క‌టించింది. ప‌దిమందితో కూడిన పురుషుల బృందంలో ఐదురుగు సింగిల్ ప్లేయ‌ర్స్ ఉన్నారు. డబుల్స్‌లో స్టార్ ధ్వయం సాత్విక్- చిరాగ్ శెట్టితో పాటు అర్జున్, ధ్రువ్ ఉన్నారు. చీఫ్ నేష‌న‌ల్ కోచ్ పుల్లెల గోపిచంద్, మ‌ల్లికా బ‌రౌహ్ శ‌ర్మ‌, విమ‌ల్ కుమార్, జ్వాలా గుత్తా, మంజుష క‌న్వార్, పార్ధో గుంగూలీలతో కూడిన సెలెక్ష‌న్ క‌మిటీ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ఇక మ‌హిళ‌ల బృందంలో ఆసియా గేమ్స్‌లో ప‌త‌కంతో మెరిసిన అన్మోల్ కార్బ్‌, త‌న్వీ శ‌ర్మ‌లు ఉన్నారు. చైనాలోని చెంగ్డూలో ఏప్రిల్ 27 నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు ఈ టోర్నీ జ‌రుగ‌నుంది. నిరుడు ఛాంపియ‌న్‌గా నిలిచిన భారత్ మరో సారి ట్రోఫీ కొట్టాల‌నే కసితో ఉంది.

మెన్స్ టీమ్ : హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, లక్ష్య‌సేన్, కిడాంబి శ్రీ‌కాంత్, ప్రియాన్షు ర‌జావ‌త్, కిర‌ణ్ జార్జే, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ క‌పిల‌, సాయి ప్ర‌తీక్, ఎంఆర్‌. అర్జున్.

ఉమెన్స్ టీమ్ : అన్మోల్ కార్బ్, త‌న్వీ శ‌ర్మ‌, అశ్మిత చ‌లిహ‌, ఇష‌రాణి బ‌రౌహ్‌, శృతి మిశ్రా, ప్రియా కొంజెబ్గ‌మ్, సిమ్రాన్ సింగీ, ర‌తికా థాకరే.

Tags:
Next Story
Share it