KCR: ప్రతిపక్షం దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

ప్రతిపక్ష పార్టీ BRS దెబ్బతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.

KCR: ప్రతిపక్షం దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రతిపక్ష పార్టీ BRS దెబ్బతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల కోసం ఖదం తొక్కిన BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఈ తాజా పరిష్టితులపై స్పందించిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో తాగునీటి సమస్యలను అరికట్టాడని జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత నీటి పరిస్థితులపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో సందర్శించి నీటి సమస్యలపై జులై నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించింది.

Tags:
Next Story
Share it