KTR:పార్టీ మారిన నాయకులకు బుద్ది చెప్పాలి

పార్టీలో పది ఏండ్లగా ఉండి ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరరాని రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.

KTR:పార్టీ మారిన నాయకులకు బుద్ది చెప్పాలి
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పది ఏండ్లగా ఉండి ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరరాని రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని దారుణంగా మోసం చేశారని, యాక్టింగ్‌కు ఆస్కార్ ఇస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి ఇయ్యాలే అని అన్నారు. మహేందర్ రెడ్డిని మంత్రిని, రంజిత్ రెడ్డిని ఎంపీ చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన కాసానిని గెలిపించుకోవాలె అని ప్రజలకు కోరారు. పార్టీ మారిన నాయకులకు బుద్ది చెప్పాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

Tags:
Next Story
Share it