T20 Worlcup: ఉత్కంఠ పోరులో కెనడా విజయం..!

టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా శుక్రవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్ కెనడా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌లో కెనడా ఘన విజయాన్ని నమోదుచేసింది

T20  Worlcup: ఉత్కంఠ పోరులో కెనడా విజయం..!
X

ఉత్కంఠ పోరులో కెనడా విజయం..!

ఐర్లాండ్ పై కెనడా సూపర్ విక్టరీ

నికోలస్ కిర్టన్ విధ్వంసం

శ్రేయాస్ మొవ్వ మొరుపులు

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా శుక్రవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్ కెనడా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌లో కెనడా ఘన విజయాన్ని నమోదుచేసింది. కెనడా బ్యాటర్లు నికోలస్ కిర్టన్ విధ్వంసం సృష్ట్రించగా.. శ్రేయాస్ మొవ్వ హార్డ్ హిటింగ్‌తో స్టేడియంలో మొరుపులు మెరిపించాడు. దాంతో కెనడా, ఐర్లాండ్ జట్టుపై 12 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడా జట్టుకు ఉహించని షాక్ తగిలింది. ఓపెనర్ నవనీత్ ధలివాల్(6), మార్క్ అడైర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరోన్ జాన్సన్(14)ను క్రెయిగ్ యంగ్ వెనక్కి పంపాడు. మంచి టాచ్‌లో ఉన్న పర్గత్ సింగ్(18) పరుగులకే చేతులేత్తేశాడు. దాంతో కెనడా మూడు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఈ సమయంలో క్రీజులో దిగిన నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ దూకుడు ఇన్నింగ్స్‌ ఆడుతూ పరుగుల వరద పారించారు. ఇక నికోలస్ కిర్టన్ ఐరీస్ బౌలర్లను ఉతికారేశాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ నికోలస్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. మరోపైవు శ్రేయాస్ మొవ్వ ధనాధన్ బ్యాటింగ్‌తో విశ్వరుపం చూపించాడు. ఈ జోడి కెనడా స్కోర్ బోర్డుకు 70 పరుగులు జతచేశారు. అయితే ఫిఫ్టి చేరువలో నికోలస్(49), బారీ మెక్‌కార్తీ బౌలింగ్ ఔటయ్యాడు. శ్రేయాస్(37) అఖిరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు మంచి స్కోర్‌ని అందించాడు. దీంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టాగా.. మార్క్ అడైర్, గారెత్ డెలానీ చెరో వికెట్ తీశారు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఆండ్రూ బల్బిర్నీ(17) జూనైద్ సిద్ధిక్వి బౌలింగ్ పెవిలియన్ కు చేరాడు. ఆ కాసేపటికే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(9) ను గొరడోన్ వెనక్కి పంపాడు. తర్వాత లోక్రాన్ టుకర్(10) రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దాంతో ఐర్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 30 రన్స్ స్కోర్ చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన హరీ టెక్టర్(7) సాద్ బిన్ జఫర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కర్తిస్ క్యాంఫర్(4), గారెత్ డెలానీ(3) వరుసగా బ్యాటింగ్ లో నిరాశపరిచారు. జార్జ్ డొక్రెల్, మార్క్ అడైర్ చ‌క‌చ‌కా సింగిల్స్, డ‌బుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కాస్త కుదురుకున్నాక ఇద్ద‌రూ బౌండ‌రీలతో చెల‌రేగారు. ఆరో వికెట్‌కు 55 ర‌న్స్ జోడించారు. కాగా, మార్క్ అడైర్(34) గొరడోన్ బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. జార్జ్(30) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కానీ కెనడా, ఐర్లాండ్ జట్టుపై 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెనడా బౌలర్లు జెరమీ గొరడోన్, దిల్లోన్ హేలిగర్ రెండు వికెట్లు పడగొట్టాగా.. జూనైద్ సిద్ధిక్వి, సాద్ బిన్ జఫర్ చెరో వికెట్ తీశారు.

Tags:
Next Story
Share it