Cm Revanth: రామోజీరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు

Cm Revanth: రామోజీరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
X

న్యూస్ లైన్ డెస్క్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రామోజీరావు కన్నుమూసిన రోజున సిడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీలో ఉండటంతో పార్థీవదేహానికి నివాళులు అర్పించలేకపోయారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సహచర మంత్రులతో ఫిల్మ్ సిటీకి వెళ్లి చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసూధన్ రెడ్డి ఉన్నారు.

Tags:
Next Story
Share it