Rotten eggs: అంగన్వాడిలో మురిగిపోయిన గుడ్ల పంపిణీ

రాష్ట్రంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వెలుగుచూసింది.

Rotten eggs: అంగన్వాడిలో మురిగిపోయిన గుడ్ల పంపిణీ
X

న్యూస్ లైన్ డెస్క్: అంగన్వాడీ కేంద్రాల్లో(Anganwadi centres) ప్రభుత్వం పోష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. గర్భిణీలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గుడ్లు, పాలు వంటి ఆహారపదార్ధాలను అందిస్తారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలో ఉన్న రెండో అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే కోడిగుడ్లు, మురిగిపోయి, దుర్వాసన వస్తున్నాయని గర్భిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉడకబెట్టినా కూడా వాసన రావడంతో వాంతులు చేసుకుంటున్నామని గర్భిణీలు, తల్లులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మంచి ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు.

Tags:
Next Story
Share it