Sangareddy: ఫుట్ వేర్ షాపులో అగ్ని ప్రమాదం

ఓ ఫుట్ వేర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Sangareddy: ఫుట్ వేర్ షాపులో అగ్ని ప్రమాదం
X

న్యూస్ లైన్ డెస్క్: సంగారెడ్డి రామచంద్రపురం పరిధిలోని అశోక్‌నగర్‌లో అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఓ ఫుట్ వేర్ షాపు(Foot wear shop)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్(Fire engine) సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో మంటల కారణంగా ఫుట్ వేర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it