High Court: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా..!

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.

High Court: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా..!
X

High Court: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టు(High Court) సోమవారం విచారణ జరిపింది. కోదండరాం(Kodandaram), అమీర్‌ అలీఖాన్‌(amir ali khan)ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. పిటిషనర్లు దాసోజు శ్రవణ్(dasoju sravan), సత్యనారాయణ(Sathyanrayana) తరఫు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. దీంతో విచారణను ఫిబ్రవరి 14కు ధర్మాసనం వాయిదా వేసింది. గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌ తమిళసైకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించారు.

ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారు. ఈ ప్రతిపాదనలను గవర్నర్‌ ఆమోదించారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ రిజెక్ట్ చేసారని సవాల్ చేస్తూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ వేశారు. గవర్నర్ పరిధికి మించి వ్యవహరించి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని, దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వాదించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags:
Next Story
Share it