Harish Rao: ఏఈఈ విద్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారు!

ఏఈఈ విద్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డియాండ్ చేశారు

Harish Rao: ఏఈఈ విద్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారు!
X

న్యూస్ లైన్ డెస్క్: ఏఈఈ విద్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డియాండ్ చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం ఉన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఆయన సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయిందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it