HCA: ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కష్టాలు..!

బకాయిల కారణంగా ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేసింది విద్యుత్ శాఖ

HCA: ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కష్టాలు..!
X

న్యూస్ లైన్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ మరోసారి అబాసుపాలైంది. బకాయిల కారణంగా ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేసింది విద్యుత్ శాఖ. పలుమార్లు నోటీసులు ఇచ్చినా హెచ్‌సీఏ పట్టించుకోలేదని, బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్ల కరెంట్ వాడుకున్నారని విద్యుత్ శాఖ తెలిపింది. కరెంట్ కట్ చేసిన సమయంలో స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయని సమాచారం. నేడు ఇరుజట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో ఈ కరెంట్ కట్ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. హెచ్‌సీఏపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. టికెట్ల రూపంలో కోట్ల రూపాయిలు సంపాదించే అసోషియేషన్.. విద్యుత్ బకాయిలు కట్టకుండా ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పవర్ కట్స్ ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ హెచ్‌సీఏ బకాయి పడటంతో కరెంట్ కట్ చేసింది విద్యుత్ శాఖ. అప్పట్లో మూడు కోట్లకు పైగా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియంలో విద్యుత్ కట్ చేశారు.

Tags:
Next Story
Share it