Jammu&Kashmir: ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్మూకశ్మీర్‌ (jammu & Kashmir) కుప్పారా జిల్లాలో (kupwara district) భారీ ఎన్‌కౌంటర్ (encounter) జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Jammu&Kashmir: ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: జమ్మూకశ్మీర్‌ (jammu & Kashmir) కుప్పారా జిల్లాలో (kupwara district) భారీ ఎన్‌కౌంటర్ (encounter) జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం కుప్వారా జిల్లా పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుగాల్పులు జరిగాయి. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అమ్రోహి, తంగ్‌ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గర నుంచి గన్స్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it