Delhi liquor policy: మరోసారి పిటిషన్ దాఖలు చేసిన కవిత

కవిత పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 12.30కి ఢిల్లీలోని హైకోర్టులో విచారణ జరగనుంది.

Delhi liquor policy: మరోసారి పిటిషన్ దాఖలు చేసిన కవిత
X

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi liquor policy) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు నెలలుగా తీహార్(Tihar) జైల్లో పోలీసుల కస్టడీలో ఉన్న BRS ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. మరోసారి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్‌(Remand) పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో ఇటీవల రౌస్‌ అవెన్యూ స్పెషల్ కోర్టు(Rous avenue special court) మే 20 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీ(Judicial custody)ని పొడిగించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 12.30కి ఢిల్లీలోని హైకోర్టులో విచారణ జరగనుంది. అంతకుముందు కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను హైకోర్టు మే 24కి వాయిదా వేసింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కవిత.. ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. న్యాయస్థానం తోసిపునిచ్చింది. మరోవైపు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తుంది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ ఐన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చారు. దీంతో కవితకు కూడా బెయిల్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:
Next Story
Share it