AP Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్తున్న కేశినేని నాని

ఓ కీలక నేత చేసిన ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

AP Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్తున్న కేశినేని నాని
X

న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కీలక నేత చేసిన ప్రకటనతో ఏపీ పాలిటిక్స్(Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి కేశినేని నాని(Kesineni Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఎంతో ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, రాజకీయ ప్రయాణాన్ని ఇంతటితో ముగిస్తున్నానని నాని ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీగా రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ప్రజల స్థైర్యం, సంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయని వెల్లడించారు. రాజకీయాలకు దూరమవుతున్నప్పటికీ విజయవాడ ప్రజల బాగోగులు, అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తన రాజకీయ జీవితంలో తన వెంటుండి నడిపించిన ప్రతి ఒక్కరికీ కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత పదేళ్లుగా ఎంపీగా గెలిచిన ఆయన.. టీడీపీ నుండి పోటీ చేశారు. కానీ, ఈసారి ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకొని పోటీ చేశారు. అయితే, రెండు సార్లు వరుసగా గెలుపొందిన ఆయన.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో 2.28 లక్షల ఓట్ల తేడాతో కేశినేని నాని ఓడిపోయారు.

Tags:
Next Story
Share it