Srikar Bharat: రాజ్‌కోట్ టెస్టుకు భరత్ దూరం.. యంగ్‌స్టర్‌కు చాన్స్!

భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగబోయే మూడో టెస్టు మ్యాచ్ లో తెలుగు కుర్రాడు శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌ పై వేటు పడటం ఖాయంగా కన్పిస్తుంది.

Srikar Bharat: రాజ్‌కోట్ టెస్టుకు భరత్ దూరం.. యంగ్‌స్టర్‌కు చాన్స్!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగబోయే మూడో టెస్టు మ్యాచ్ లో తెలుగు కుర్రాడు శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌ పై వేటు పడటం ఖాయంగా కన్పిస్తుంది. భరత్ పేల‌వ ఫామ్‌తో నిరాశ‌ప‌రుస్తున్నాడు. రిష‌భ్ పంత్ లోటును భ‌ర్తీ చేయ‌లేక విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో విఫలమైన భ‌ర‌త్.. సొంత గ‌డ్డ‌పై కూడా తేలిపోతున్నాడు. దాంతో, అత‌డిపై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది బీసీసీఐ. ఇక రాజ్‌కోట్ టెస్టులో భ‌ర‌త్ స్థానంలో యంగ్‌స్ట‌ర్ ధ్రువ్ జురెల్‌ను ఆడిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌పై 116 ప‌రుగుల‌తో చెల‌రేగిన భ‌ర‌త్.. సీనియ‌ర్ జ‌ట్టుపై మాత్రం చ‌తికిల‌ప‌డుతున్నాడు. అదే ధ్రువ్ జురెల్ మాత్రం ప‌ర‌గులు వ‌ర‌ద పారిస్తున్నాడు. 22 ఏళ్ల జురెల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచ్ ల్లో 46.47 సగటుతో 790 పరుగులు చేశాడు. వీటిలో ఒక శతకం, ఐదు ఆర్థ సెంచరీలు ఉన్నాయి. దాంతో, మూడో టెస్టులో జురెల్‌కు చాన్స్ ఇవ్వాల‌ని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌లు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 15న రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇక వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ గాయ‌ప‌డ‌డంతో భ‌ర‌త్‌కు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆడే చాన్స్ వ‌చ్చింది. అయితే.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 101 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.. కానీ తన వికెట్ కీపింగ్‌తో ఆందరినీ ఆక‌ట్టుకున్నాడు. కాగా, ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్ ల్లో (5), (23) ప‌రుగుల‌తో నిరాశ‌ప‌రిచాడు. ఇక మొదటి టెస్టులో 41 పరుగులు చేసినా.. వైజాగ్ టెస్టులో విఫ‌ల‌మ‌య్యాడు. ఇక భారత్ తరపున 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భ‌ర‌త్ 12 ఇన్నింగ్స్‌ల్లో 20.09 స‌గ‌టుతో 221 పరుగులు చేశాడు.

Tags:
Next Story
Share it