IPL 2024: బెంగళూరు పై లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ కొట్టింది.

IPL 2024: బెంగళూరు పై లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
X

చిత్తుగా ఓడిన ఆర్సీబీ

హాఫ్ సెంచరీతో ఆదరగోటినా

న్యూస్ లైన్ స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ కొట్టింది. బెంగళూరుని చిత్తుగా ఓడించింది. లక్నో బ్యాటర్స్ డికాక్ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పూరన్ ఆఖరిలో చితకొట్టుడు కొట్టాడు. దీంతో లక్నో ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో ఓపెన‌ర్లు మంచి ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ మంచి భాగ‌స్వామ్యని నెలకొల్పారు. ఈ జోడి లక్నో స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రాహుల్(20) భారీ షార్ట్‌కు ప్రయత్నచి మయాంక్ దగ్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్(6) ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్ ఓవర్‌లో కీపర్ అనుజ్ రావ‌త్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిలకగడా ఆడుతూ డికాక్( 56 బంతుల్లో 81 రన్స్ 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క‌స్ స్టోయినిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుకు 40 రన్స్ జతా చేశారు. మరో సారి బౌలింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌మెల్ మార్క‌స్ స్టోయినిస్(24) పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లక్నో 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో ఎంట్రీ ఇచ్చిన నికోలస్ పూరన్ డికాక్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లుకు ఉచకోత చూసించాడు. 21 బంతుల్లో 40 పరుగులు నాటౌట్‌గా ఉన్నాడు. చివరి దాకా ఆడిన డికాక్ రీస్ టోప్లీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు మాక్సివెల్ రెండు వికెట్లు పడగొట్టాగా.. సిరాజ్, దయాల్ ఒక వికెట్ తీశారు.

182 లక్ష్యని చేదేంచేందుకు బరిలో దిగిన బెంగళూరుకి ఓపెనర్లు మంచి ప్రారంభని అందిచారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ స్కోర్ బోర్డుకు 30 పరుగులు జోడించారు. మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో విరాట్(22) పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ తర్వాత ఫాఫ్(19) ‌ను పడిక్కల్ రనౌట్ చేశాడు. దీంతో ఆర్సీబీ పవర్‌ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో దిగిన మ్యాక్స్‌వెల్(0), కెమెరాన్ గ్రీన్(9) విఫ్లమైయ్యరు. దీంతో బెంగళూరు మిడిల్ అండర్ కుప్పకులింది. ఈ సమయంలో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 50 రన్స్ కొట్టింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన రాజత్ పాటిదర్ ఆర్సీబీ ని ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే మయాంక్ యాదవ్ బౌలింగ్ లో పాటిదర్(29) ప‌డిక్క‌ల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత అనూజ్ రావత్ ను స్టోయినిన్స్ పవిలియన్ కు చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లాంరోర్ బెంగళూరు జట్టును కష్టాలో నుంచి గట్టెక్కించాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 13 బంతులలో 33 రన్స్ చేశాడు. కానీ యాష్ ఠాకూర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ నిరాశపరిచారు. బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. దినేష్ కార్తీక్ (4), రీస్ టోప్లీ(3), మయాంక్ దగ్గర్(0), మహ్మద్ సిరాజ్ (12) విఫలమయ్యారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో బౌలర్లు మయాంక్ మూడు వికెట్లతో విజరంభించగా నవీన్ ఉల్ హాక్ రెండు వికెట్లు తీశాడు.

Tags:
Next Story
Share it