Fell: 11వ అంతస్థు నుండి పడి వ్యక్తి మృతి

నిర్మాణంలో ఉన్న భవనంలోని 11వ అంతస్థు నుండి జారిపడిపోవడంతో రమేశ్‌ సింగ్‌(40) అనే కార్మికుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.

Fell: 11వ అంతస్థు నుండి పడి వ్యక్తి మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌ నల్లగండ్లలో ప్రమాదవశాత్తూ భవనంపై నుండి పడి వ్యక్తి మృతిచెందాడు. నిర్మాణంలో ఉన్న భవనంలోని 11వ అంతస్థు నుండి జారిపడిపోవడంతో రమేశ్‌ సింగ్‌(40) అనే కార్మికుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. చందానగర్‌(Chandanagar)లో రంజైవైభవ్ సంస్థకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. కార్మికుడి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it