Rains: వాతావరణ శాఖ కీలక సూచన

రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

Rains: వాతావరణ శాఖ కీలక సూచన
X

న్యూస్ లైన్ డెస్క్: మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు(Rains) మొదలమయ్యాయి. వేసవి తాపంతో వేడిక్కిన రాష్ట్రాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఇప్పటికే ఇరురాష్ట్రాల్లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సోమవారం ఉత్తర అరేబియా సముంద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. దీంతో నాసిక్‌, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ లోని వాతావరణాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రభావం కారణంగా తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:
Next Story
Share it