PET DOG: వీళ్లే మనషులురా.. రానురాను ఉన్మాదులైపోతున్నారు కదా!

కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిని అతడి భార్యని కర్రలతో కొట్టిన ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) చోటుచేసుకుంది.

PET DOG: వీళ్లే మనషులురా.. రానురాను ఉన్మాదులైపోతున్నారు కదా!
X

న్యూస్ లైన్ డెస్క్: కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిని అతడి భార్యని కర్రలతో కొట్టిన ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) చోటుచేసుకుంది. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. "నగరంలోని రహమత్‌నగర్‌కి (rahmathnagar) చెందిన శ్రీనాథ్ (srinadh) పెంపుడు కుక్క (pet dog) మే 8వ తేదీన దానికి కట్టి ఉంచిన బెల్ట్‌ని తెంచుకొను ఇంటి ఎదురుగా ఉన్న ధనుంజయ్ (dhanunjay) ఇంట్లోకి వెళ్లింది. అక్కడతో వాళ్ల మధ్య గొడవ మొదలైంది. శ్రీనాథ్ కుక్క తమ వ్యక్తిని కరిచిందని ధనుంజయ్ మధురానగర్ పోలీస్ స్టేషన్లో (madhuranagar ps) కంప్లైంట్ ఇచ్చాడు. ఎలక్షన్ బందోబస్తు కారణంగా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుక్కపై కక్ష పెంచుకున్న ధనుంజయ్ మరో ముగ్గురితో కలిసి యజమానిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన అతడి భార్యను, కుక్కనూ దారుణంగా కర్రలతో కొట్టారు. గమనించిన స్థానికులు వాళ్ల అడగించారు. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం." ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it