Police: భూకుంభకోణం కేసులో ముగ్గురు అరెస్ట్

జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో సోమవారం పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

Police: భూకుంభకోణం కేసులో ముగ్గురు అరెస్ట్
X

న్యూస్ లైన్ డెస్క్: జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో సోమవారం పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ లను అరెస్ట్ చేశారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం జరిగింది. బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాగా, ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులో మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు వెళ్లారు. దీంతో మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it