Priyanka Gandhi: ప్రజల మధ్య ఉన్న ప్రధానిని మనం చూడలే

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Priyanka Gandhi: ప్రజల మధ్య ఉన్న ప్రధానిని మనం చూడలే
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో ప్రజల మధ్య ఉన్న ప్రధానమంత్రిని మనం చూడలేదని అన్నారు. ప్రధాని మోడీ ఎప్పుడు ప్రజల సమస్యలు, నిరుద్యోగం, వ్యవసాయ ఆధారిత సమస్యలు, కార్మికుల సమస్యలు, మధ్యతరగతి సమస్యలపై మాట్లాడలేదని అన్నారు. మోడీ హిందూ-ముస్లింలపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు మోడీ '400 పార్' అన్నారు. మరి ఇప్పుడు నాలుగు రాష్ట్రల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో బీజేపీపై ప్రజలో వ్యతిరేకత వచ్చిందని అందుకే మోడీ ఫిర్ ఎక్ బార్ 400 పార్ అన్నడం లేదని అన్నారు. దేశంలో ఇండియా కూడమి అధికారంలో వస్తుందని ఆమె అన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ రాయ్‌బరేలి, అమేథి స్థానాలు గెలుస్తుందని తెలిపారు.

Tags:
Next Story
Share it