Bangalore: రేవణ్ణ కస్టడీ పొడిగింపు

ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన రేవణ్ణ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

Bangalore: రేవణ్ణ కస్టడీ పొడిగింపు
X

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కస్టడీని పొడిగించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆయన.. గత వారం రోజులుగా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. మే 3న అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చిన రేవణ్ణను పోలీసులు విమానాశ్రయం వద్దనే అరెస్ట్ చేశారు. ఇక ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన రేవణ్ణ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మరోవైపు రేవణ్ణను కస్టడీకి అనుమతించాలని కోరుతూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. రేవణ్ణ కస్టడీని ఈ నెల 10 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. కాగా, లైంగిక ఆరోపణలు వెలుగు చూసిన ఆరు రోజుల తరువాత.. ఏప్రిల్ 27న ప్రజ్వల్ డిప్లొమేటిక్ పాస్ పోర్టు(diplomatic passport) సహాయంతో రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అనంతరం విచారణకు హాజరుకావాలని పలు మార్లు కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేసినా లాభం లేకపోయింది. దీంతో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా ఆదేశించారు.

Tags:
Next Story
Share it