IPL: చిన్నస్వామిలో రాయల్స్ విజయం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా ఆదివారం సాయత్రం జరిగిన బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

IPL: చిన్నస్వామిలో రాయల్స్ విజయం..!
X

చిన్నస్వామిలో రాయల్స్ విజయం..!

హాఫ్ సెంచరీతో చెలరేగిన పాటిదార్

విల్ - కెమెరాన్ విధ్వంసకర ఇన్నింగ్స్

ఢిల్లీ జట్టుకు నిరాశ

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా ఆదివారం సాయత్రం జరిగిన బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ అర్ధ సెంచరీతో చెలరేగగా.. విల్ జాక్స్, కెమెరాన్ గ్రీన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. దీంతో బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే షాక్ తిగిలింది కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6) ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులో విల్ జాక్స్ వచ్చాడు. విరాట్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే కోహ్లీ(27) ఇషాన్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ పోరెల్‌కు చిక్కాడు. తర్వాత బ్యాటింగ్‌కు రజత్ పాటిదార్ దిగాడు. హార్డ్ హిటింగ్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయిడు. ధానధన్ బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ బౌలర్లకు ఊచకోత చూపించాడు. పాటిదార చిన్నస్వామిలో సిక్సర్ల మెత మోగించాడు. దీంతో రజత్ పాటిదార్( 32 బంతుల్లో 52 పరుగులు 3 ఫోర్లు, 3 సిక్సర్ల) సహాయంతో ఫిఫ్టి పూర్తి చేశాడు. ఇక విల్ జాక్స్ కూడా బౌండరీలు, సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి కలిసి ఆర్సీబీ స్కోర్ బోర్డుకు 80 రన్స్ జోడించారు. అయితే రసీక్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ కాసేపటికే జాక్స్(42) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయి 140 రన్స్ కొట్టింది. ఇక ఈ సమయంలో బ్యాటింగ్‌కు కెమెరాన్ గ్రీన్‌ దిగాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక చివరి గ్రీన్(32) వరకు ఉండి బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవరల్లో 187 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఖాలీల్ అహ్మద్, రసీక్ సలామ్ రెండు వికెట్లు పడగొట్టాగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, చెరో వికెట్ తీశారు.

187 పరుగల లక్ష్మాని ఛేదించేందుకు బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు అభిషక్ పోరెల్(2), డేవిడ్ వార్నర్(1) పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత మంచి టాచ్‌లో ఉన్న జాకే ఫ్రాజర్(21) కూడా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. షోయ్ హోప్, అక్షర్ పాటేల్ క్రీజులో దిగారు. ఇద్దరు దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అక్షర్ పాటేల్ బౌండరీలు, సిక్సర్లు బదుతూ అక్షర్( 39 బంతుల్లో 57 పరుగులు 5 ఫోర్లు, 3 సిక్సర్ల )తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత త్రిస్థాన్ స్టబ్స్(3), రాసిక్ సలామ్(10), కుల్దీప్ యాదవ్(6), ముఖేష్ కుమార్(3) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లు యాష్ దయాల్ మూడు వికెట్లు పడగొట్టాగా.. లాకి ఫర్గుసన్ రెండు వికెట్లు తీశాడు.

Tags:
Next Story
Share it